Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

రాష్ట్రంలో ఓటరుగా నమోదై ఉండాలి
విదేశీ పౌరసత్వం ఉండరాదు.. బరిలోకి ప్రవాసులు?

విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న ఎన్‌ఆర్‌ఐలు స్వదేశంలో జరిగే ఎన్నికల్లో పోటీ చేయలేకపోతున్నామని బాధ పడుతున్నారా? ప్రవాస భారతీయులు(ఎన్‌ఆర్‌ఐ) ఏ దేశంలో ఉన్నా భారత్‌లో జరిగే చట్టసభల ఎన్నికల్లో పోటీ చేయొచ్చు. ఎన్‌ఆర్‌ఐలు ఎన్నికల్లో పోటీ చేయడంపై అనుమానాలకు ఎన్నికల కమిషన్‌ 8ఏళ్ల క్రితమే తెరదించింది. విదేశాల్లో ఉన్నవాళ్లూ ‘ఆన్‌లైన్‌’ ద్వారా ఓటు వేసేందుకు ఈసీ అనుమతి ఇచ్చింది. చట్ట సభలకూ పోటీ చేయవచ్చని పేర్కొన్నది. ఓటు వేసేందుకు భారతీయ పౌరసత్వం కలిగి ఉండి ఓటరు జాబితాలో పేరుండాలని పేర్కొన్నది. అసెంబ్లీకి పోటీ చేయాలంటే ఆ రాష్ట్రంలో స్థానికుడై ఉండాలని తెలిపింది. విద్య, ఉద్యోగ, ఉపాధి రీత్యా విదేశాల్లో ఉంటున్నట్లు నిరూపించుకోగలగాలని పేర్కొన్నది. పార్లమెంట్‌కు పోటీ చేయాలంటే దేశంలోని ఏ ప్రాంతంలోనైనా స్థానికత ఉండాలి. అయితే, వీరికి విదేశీ పౌరసత్వం ఉండరాదు. దీంతో తెలంగాణ అసెంబ్లీకి పోటీ చేసేందుకు కొందరు ఎన్‌ఆర్‌ఐలు ఆసక్తి చూపుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. నల్లగొండ జిల్లాలోని ఒక స్థానంపై ఎన్‌ఆర్‌ఐ ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇతర పార్టీల టికెట్లను కూడా ఎన్‌ఆర్‌ఐలు ఆశిస్తున్నట్లు సమాచారం.