Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

మనం తాగే డ్రింక్‌లో ఉత్సాహపరిచే శక్తి చక్కెర, కెఫిన్‌ ద్వారానే వస్తుంది. మనం నిద్రించేందుకు ఉపకరించే ఎడెనోసిన్‌ అనే మెదడులోని రసాయనం ప్రభావాన్ని కెఫిన్‌ అడ్డుకుంటుంది. అలాగే మెదడులోని న్యూరాన్లు మెదడును ఉద్రేకపరిచేందుకు కారణమవుతుంది. శరీరం అత్యవసర స్థితిలో ఉందనుకుంటే, శరీరం ఏ విధంగా స్పందించాలన్నది పిట్యూటరీ గ్రంథి విడుదల చేసే అడ్రినలిన్‌ ద్రవం మీద ఆ స్పందన ఆధారపడి ఉంటుంది. ఈ హార్మోన్లు గుండె కొట్టుకోవడాన్ని వేగవంతం చేస్తుంది. కళ్లు పెద్దవయ్యేట్టు చేస్తుంది. లివర్‌ కూడా రక్త ప్రసరణలోని అదనపు చక్కెరను విడుదల చేస్తుంది. ఆనందాన్ని కలిగించే మెదడు కేంద్రంలోని రసాయనం డొపామైన్‌ స్థాయి పైన కెఫిన్‌ ఎంతో ప్రభావం చూపుతుంది.