Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

సోషల్‌మీడియాలో మునిగితేలుతున్న టీనేజర్లు స్మార్ట్‌ఫోన్‌లు అతిగా వాడుతుండటంతో డిప్రెషన్‌, యాంగ్జైటీలకు లోనవుతున్నారు. ఈ రుగ్మతలను వదిలించుకునే క్రమంలో వారు ప్రమాదకర ధోరణిలో వెళుతున్నారు. వైద్యులను సంప్రదించే సమయం లేదంటూ యువత సొంతవైద్యానికి దిగుతుండటంతో పలు అనర్ధాలు చోటుచేసుకుంటున్నాయని ఓ అథ్యయనంలో వెల్లడైంది. తమ మానసిక, శారీరక రుగ్మతలకు మూలమైన సోషల్‌ మీడియాలోనే దీనిపై చర్చిస్తూ పలువురు టీనేజర్లు తమ మానసిక అలజడులను తగ్గించుకునేందుకు యాంటీ యాంగ్జయిటీ మందులను తమకు తామే వాడేస్తున్నారు. జనాక్స్‌ అనే యాంగ్జైటీని తగ్గించే ఔషధాన్ని యువత విరివిగా వాడుతున్నదని వెల్లడైంది.

డీలర్లు, ఆన్‌లైన్‌ ఫార్మసీల నుంచి ఈ ఔషధాన్నిటీనేజర్లు కొనుగోలు చేస్తున్నారు. ఈ మందుకు బానిసలవుతున్న యువత పలు అనర్ధాలను ఎదర్కొంటున్నారు. జనాక్స్‌ను వాడిన తర్వాత గత కొద్దినెలల్లో బ్రిటన్‌లోని పలు ప్రాంతాల్లో యువత ఆస్పత్రుల్లో చేరినట్టు వార్తలు వచ్చాయి. మరోవైపు జనాక్స్‌, పెయిన్‌కిల్లర్‌ ఫెంటానిల్‌ ఓవర్‌డోస్‌ కారణంగా బ్రిటన్‌, అమెరికాలో కొందరు మృత్యువాతన పడ్డారని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జనాక్స్‌ను ఆల్కహాల్‌తో కలిపి తీసుకోవడం ప్రమాదమని, యువత ఈ డ్రగ్‌కు దూరంగా ఉండటం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.

ఇక సోషల్‌ మీడియాలో ఈ డ్రగ్స్‌ను ప్రచారం చేస్తుండటంతో ముఖ్యంగా టీనేజర్లు వీటిబారిన పడుతున్నారు. ఈ ఔషధాల సైడ్‌ ఎఫెక్ట్స్‌ను పట్టించుకోకుండా వీటిని వాడటం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.