Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

 భారత సంతతికి చెందిన రీటా బరన్వాల్‌ త్వరలో అమెరికా అణుశక్తి విభాగం అధిపతి కానున్నారు. అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ గత వారం ఈమెను ఈ పదవికి నామినేట్‌ చేశారు. ఈ ప్రతిపాదనపై సెనెట్‌ ఆమోదముద్ర వేస్తే రీటా ఇంధన విభాగం అసిస్టెంట్‌ సెక్రటరీ హోదాలో నియమితులవుతారు. ఈ హోదాలో అణు సాంకేతికత పరిశోధన, నిర్వహణ, అభివృద్ధి బాధ్యతలను రీటా చేపడతారు. ప్రస్తుతం అణు విభాగంలోని గేట్‌వే ఫర్‌ యాక్సిలరేటెడ్‌ ఇన్నోవేషన్‌కు డైరెక్టర్‌గా ఉన్న రీటా.. గతంలో అమెరికా నావికాదళ రియాక్టర్లలో వాడే అణు ఇంధన పదార్థాల పరిశోధన, అభివృద్ధి విభాగానికి నేతృత్వం వహించారు. రీటా బరన్వాల్‌ మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ నుంచి బీఎస్సీ డిగ్రీ, మిషిగాన్‌ యూనివర్సిటీ నుంచి ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ పొందారు.