Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

అగ్రరాజ్యం అమెరికాలో మారో భారతీయుడిపై దాడి జారిగింది. కొందరు గుర్తు తెలియని దుండగులు అతనిపై కాల్పులు జరిపారని ఆ యువకుడి తల్లి తండ్రులకు సమాచారం అందింది. అయితే ఈ దాడి ఈ నెల 4న జరగగా అతని తల్లి తండ్రులకు 5 న తెలియజేశారు. దీంతో ఆ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలిసిన సమాచారం ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి చెందిన ముబెన్ అహ్మద్ కాలిఫోర్నియా యూనివర్సిటీలో ఎమ్మెస్ చదువుకుంటూ అక్కడే ఓ హోటల్ లో పార్ట్ టైం జాబ్ చేసుకుంటున్నాడు.

అయితే కొందరు గుర్తు తెలియని వ్యక్తులు జూన్ 4 సాయంత్రం 6గంటల సమయంలో ముబెన్ అహ్మద్ ను గన్ తో షూట్ చేశారని ఆ యువకుని సన్నిహితులు అతని తల్లిదండ్రులకు తెలియజేశారు. దీంతో అతని తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. ప్రస్తుతం అతను హాస్పిటల్ చిక్కిత్స పొందుతున్నాడని అయితే పరిస్థితి కొంచం సీరియస్ గా ఉందని తెలియడంతో ముబెన్ తండ్రి ముజీబ్ అహ్మద్ అమెరికాకు వెళ్ళడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం వీలైనంత త్వరగా వీసాను ఇవ్వాలని అధికారుల సహాయాన్ని తీసుకుంటున్నాడు. ఇప్పటికే నీటిపారుదల శాఖ మంత్రి టి హరీష్ రావు, ఇతర ప్రభుత్వ ప్రతినిధులు కూడా సహాయపడుతున్నారని ముజిద్ తెలిపారు. అంతే కాకుండా ముబెన్ కుటుంబానికి సహాయపడేందుకు ఎంబీటీ నేత అంజదుల్లా ఖాన్ మంత్రి కేటీఆర్ కు , కేద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ కి లేఖ రాశారు.