Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

హైదరాబాద్ లో ఐటీ కారిడార్ పై ఉగ్రవాదులు కన్నుపదిందని, ఐటీ పార్క్ లో వున్న షాపింగ్ మాల్ లో దాడులకి తెగబడే అవకాశాలు వున్నాయని ఇంటలిజెన్స్ అధికారులు తాజాగా తెలంగాణా పోలీసులకు సమాచారం అందించినట్లు తెలుస్తుంది. దీంతో అప్రమత్తమైన పోలీస్ యంత్రాంగం మాదాపూర్, ఐటెక్ సిటీ లో ఐటీ కంపెనీలకు భారీ భద్రత ఏర్పాట్లు చేసినట్లు, అలాగే అన్నిచోట్ల క్షుణ్ణంగా జల్లెడ పడుతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఉగ్రవాదులు హైదరాబాద్ లోకి ఎంటర్ అయిపోయారని, ఎ క్షణమైనా దాడులకు దిగే ప్రమాదం వుందని కూడా నిఘా వర్గాలు సమాచారం. ఈ హెచ్చరికల నేపధ్యంలో ఐటీ కారిడార్ లో ఉన్న కంపెనీలలో ఉద్యోగాలు చేసే ఎంప్లాయిస్ తెగ ఆందోళన పడుతున్నట్లు కూడా తెలుస్తుంది. ఎ క్షణం ఎటు వైపు నుంచి దాడులు చేస్తారో అనే భయంతో ఉద్యోగులు వున్నట్లు సమాచారం. అయితే నిఘా వర్గాలు ఎప్పుడు చేసినట్లే అప్రమత్తంగా వుండాలని హెచ్చరికలు చేశాయని, ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలంగాణా పోలీస్ అధికారులు చెబుతున్నారు.