Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

ఆస్ట్రేలియాకు చెందిన ఓ అందగతే సోషల్ మీడియా లో సంచలనంగా మారింది. ఆమె బికిని ఫోజులకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఆమె అభిమానుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది.బికినీల్లో ఫోజులిస్తూ సోషల్ మీడియాలో అందగత్తెలు ఎప్పుడూ సందడి చేస్తూనే ఉంటారు. ఇంతకీ సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారిన ఈ భామ ప్రత్యేక ఏంటని అనుకుంటున్నారా.. అయితే వివరాల్లోకి వెళదాం.

బికినిలో అందాలు ఆరబోస్తూ అందరి నోట్లో నానుతున్న ఈమె పేరు కారోలిన్ హార్జ్. అందంతో మెరిసిపోతున్న ఈమె వయసు ఏ పాతికేళ్లో ఉంటాయనుకుంటే మీరు పొరపడినట్లే. ఆమె 70 ఏళ్ల ముసలమ్మ. నమ్మడానికి కష్టంగా ఉన్నా ఆమె వయసు నిజంగా 70 ఏళ్లు. అందుకే ఆమెని ప్రపంచంలోనే అత్యంత ‘అందమైన అమ్మమ్మ’గా నెటిజన్లు కీర్తిస్తున్నారు. నెటిజన్ల నుంచి వస్తున్న ప్రశంసల పై కారోలిన్ స్పందించింది. తనకు 28 ఏళ్లనుంచి షుగర్ వ్యాధి ఉందని తెలిపింది. అప్పటినుంచి తన ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నానని తెలిపింది. అందువలనే తాను అందంగా కనిపిస్తున్నాని పేర్కొంది.