Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

ఇండియా, పాకిస్తాన్ సరిహద్దులో గత కొన్ని నెలలుగా అవ్యక్త స్థితి నెల కొని ఉన్న సంగతి అందరికి తెలిసిందే. పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతూ భారత సైన్యాన్ని రెచ్చగొడుతూ తన దుందుడుకు స్వభావాన్ని చూపిస్తుంది. భారత్ ఆర్మీ వరుసగా వారికి గట్టి హెచ్చరికలు పంపిస్తున్న, పాకిస్తాన్ తన స్వభావాన్ని మాత్రం మార్చుకోవడం లేదు. దీంతో రెండు దేశాల సైన్యాలు సరిహద్దు లో పూర్తిగా మొహరించి ఉన్నాయి. ఇదే సమమయం రెండు దేశాల ఆర్మీ చీఫ్ లు తరుచుగా సరిహద్దుకి వెళ్తూ, ఆర్మీ కార్యకలాపాలని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఎ క్షణంలో అయిన యుద్ధానికి ఇండియన్ రక్షణ వ్యవస్థ సిద్ధంగా వుండాలని ఆర్మీ చీఫ్ ఆదేశాలు జారీ చేసారు. అలాగే మరో వైపు పాకిస్థా ఆర్మీ చీఫ్ కూడా భారత్ చర్యలని వెంటనే తిప్పి కొట్టేందుకు అందరు సిద్దంగా వుండాలని వారి ఆర్మీకి సూచిస్తున్నారు.

ఇలా రెండు దేశాల మధ్య ప్రస్తుతం యుద్ధ వాతావరణం నెలకొని ఉంది. మరో వైపు ముదస్తూ చర్యలుగా భారత్, పాక్ సరిహద్దులో ఉన్న గ్రామాల్లోని ప్రజలని ఆర్మీ అధికారులు ఖాళీ చేయించి, ఆర్మీ స్థావరాలకు చేరవేస్తున్నారు. ఇదంతా చూస్తూ వుంటే భారత్- పాకిస్తాన్ మధ్య ఎ రోజైన యుద్ధం మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని చాలా మంది అనుకుంటున్నారు. రెండు దేశాల మధ్య మరో కార్గిల్ యుద్ధం తప్పేల లేదని తేల్చి చెప్పేస్తున్నారు. అయితే గతంలో పోల్చుకుంటే ఇప్పుడు పాకిస్తాన్ తో యుద్ధానికి వెళ్ళడం వలన భారత్ ఎక్కువ నష్టపోయే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు. ప్రస్తుతం భారత్ ఎన్నడూ లేని స్థాయిలో అభివృద్ధి మాత్రంతో ప్రపంచ ఆర్ధిక రంగంలో తన సత్తా చాటుకునే మార్గంలో ఉంది. ఇలాంటి సమయంలో యుద్ధం భారత్ అభివృద్ధికి పెద్ద అడ్డంకిగా మారే అవకాశాలు ఉన్నాయని ఆర్ధిక విశ్లేషకులు అంటున్నారు. అయితే పాకిస్థాన్ తన ప్రవర్తన మార్చుకోకపోతే యుద్ధం చేయడంలో ఎలాంటి తప్పు లేదని కూడా అంటున్నారు.