Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

ప్రస్తుతం తెలంగాణలో భూ వివాదాలపై వస్తున్న ఆరోపణలకు ఎట్టకేలకు ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. మంగళవారం ప్రగతి భవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన ఆయన కొన్ని ముఖ్యమైన విషయాలను తెలియజేశారు. తెలంగాణాలో ఎటువంటి భూ స్కామ్ లు జరగలేదని, నగరంలో కూడా ఎక్కడ కూడా భారీ భూ కుంభ కోణాలు లేవని స్పష్టం చేశారు. అయితే రిజిస్ట్రేషన్లలో అవకతవకలకు పాల్పడ్డ వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటాని చెబుతూ.. ఇప్పటికే క్రిమినల్‌ కేసులు నమోదు చేశామని చెప్పారు. కానీ సీబీఐ దర్యాప్తు కోరాల్సిన అవసరం లేదని కేసీఆర్ తెలిపారు.

అంతే కాకుండా భూ కబ్జాలకు ఎవరైనా పాల్పడితే ఊరుకునేది లేదని, దాని వెనుక ఎంతటి పెద్దవారి హస్తం ఉన్న విడిచిపెట్టబోమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ తో పాటు , డీజీపీ, పోలీస్‌ కమిషనర్‌ మరియు మరికొంతమంది ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఇలాంటి విషయంలో అధికారులు సీరియస్ గా ఉండాలని, వెనుకడుగు వేయొద్దని సీఎం ఆదేశాలు జారీ చేశారు