Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

రాజకీయంలో నాయకులు తీరు ఎప్పుడు ప్రతి సారి ప్రజలని ఆశ్చర్యపరుస్తూనే వుంటుంది. నిజానికి వాళ్ళు చేసే రాజకీయాలు జనానికి అర్ధం కావనే ఫీలింగ్స్ తో వాళ్ళు వుంటారు. అయితే వాళ్లకి తెలియని విషయం ఏంటంటే. రాజకీయ నాయకులంటే ప్రజల ద్రుష్టిలో ఓ బఫూన్స్. అధికార, ప్రతిపక్షాల మధ్య గొడవలు, జనం మధ్యకి వచ్చి వాళ్ళు ఇచ్చే ప్రసంగాలు అబ్బో. జనానికి ఎంత కంటే వినోదం ఇంకెక్కడా దొరకదు. అందుకే సినిమాలకి ఎంత క్రేజ్ వుందో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలకి కూడా అంతే క్రేజ్ వుంది. రాజకీయ నాయకులు పద్ధతులు చూసే జనానికి ఓ తెలుగు కామెడీ చూసిన ఫీలింగ్ కలుగుతుంది. ఇతకి అసలు విషయం ఎంటటే. ఈ మధ్య తెలంగాణాలో రాహుల్ పర్యాటన జరిగింది. దాని నిర్వహణ బాధ్యతని కాంగ్రెస్ నాయకులు జగ్గారెడ్డి చూసుకున్నారు. ఈ విషయ మీద రాహుల్ దగ్గర విహెచ్ ప్రస్తావించినపుడు. వెంటనే రాహుల్ మీరు కూడా ఎంతో కొంత సాయం చేయండి అని హనుమంతురావుని అడ్డంగా ఇరికిన్చేసారు. ఇక తప్పని పరిస్థితిలో విహెచ్ తన దగ్గర వున్నా బ్రాస్ లైట్ ని పార్టీ కోసం ఉపయోగించాల్సిందిగా ఇచ్చేసాడు.

అయితే ఇప్పుడు ఆ బ్రాస్ లైట్ ని కాంగ్రెస్ పార్టీ వేలానికి పెట్టింది. ఇంతకి వేలం ఎందుకు అంటే. దానిని వేలం వేయగా వచ్చిన డబ్బుతో రైతులని కాంగ్రెస్ నాయకులు ఆడుకుంటారంట. అయితే ఈ విషయం తెలిసిన జనం, కాంగ్రెస్ నాయకుల పద్ధతి చూసి నవ్వుకుంటున్నారు. కాంగ్రెస్ నాయకులని ఎంత ఉదారగుణమో కదా అని ఏటకారంగా మాట్లాడుకుంటున్నారు. నిజానికి ఈ బ్రాస్ లైట్ అమ్మితే మహా అయితే లక్ష, లక్ష ఎబ్భై వేల వరకు మాత్రమె వస్తాయి. అయితే ఆ బ్రాస్ లైట్ ఏదో ఎలిజబెత్ మహారాణి, ఛత్రపతి శివాజీని అన్న రేంజ్ లో వేలం వేస్తామని చెప్పడం చాలా హాస్యాస్పదంగా వుందని ప్రజలు అనుకుంటున్నారు. అయితే ఈ బ్రాస్ లైట్ వేలం ని తెలంగాణా కాంగ్రెస్ పార్టీ సోమవారం నిర్వహించాలని అనుకున్న ఏవో కారణాల వలన ఆగిపోయింది.