Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

రోజు రోజుకి ప్రజలు కొత్తదనం కోరుకుంటున్నారని ఉత్తర ప్రదేశ్,ఉత్తర ఖండ్ , మణిపూర్, పంజాబ్,గోవా రాష్ట్రాల్లో వెలువడిన ఫలితాలను బట్టి చూస్తే మనకే అర్ధమవుతుంది. యువత కూడా ఓటు హక్కు మీద అవగాహన రావడంతో భారతదేశ రాజాకీయ రంగులు మారుతున్నాయి. ఎలక్షన్ లు అయిన ప్రతిసారి ఆశ్చర్యానికి గుర్తు చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

గత 15 ఏళ్లుగా భరత దేశ రాజకీయ ఓటింగ్ పర్సెంటేజ్ ను గమనిస్తే దాదాపు 90% ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు ఇంతకు ముందు దేశ జనాభాలో 55% ప్రజలు కూడా ఓటు వేసేవారు కాదని తాజాగా జరిపిన సర్వేలో వెలువడింది.ముఖ్యంగా యువతే 65% ఓటింగ్ వేశారని సర్వేలు వెల్లడిస్తున్నాయి. 2012 లో చివరి సారిగా ఈ అయిదు రాష్ట్రాల్లో గెలిచినా పార్టీలను కాకుండా నూతన నాయకులను ఎంచుకోవడంతో సరికొత్త రాజకీయ పరిణామాలు భారతదేశం లో చోటు చేసుకుంటున్నాయి. ఈ విధంగా దేశం లో ప్రజలు తమ ఓటు హక్కును సంపూర్ణంగా కొత్తదనం కోసం వినియోగిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.