Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

ప్రస్తుతం తెలంగాణాలో జరుగుతున్న భూ వివాదాల గురించి టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వ పనితీరును తప్పుబట్టారు. అంతే కాకుండా తెరాసా ప్రభుత్వ నాయకులపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగిన మియాపూర్‌ భూములను బుధవారం కాంగ్రెస్‌ నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికార పార్టీపై విమర్శలను చేశారు.

ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో ప్రభుత్వ ఆస్తులకు రక్షణ లేదు. అండగా ఉండాల్సిన నాయకులే భూములను ,వనరులను మరియు ఇతర ప్రభుత్వ ఆస్తులను కూడా అక్రమంగా దోచుకుంటున్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత కేసీఆర్ ప్రభుత్వం ప్రజలకు చేసిన మంచిపనులేంటో తెలియజేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. అలాగే ఈ భూ కుంభకోణాలకు సరైన సమాధానం చెప్పకుండా తప్పించుకుంటున్నారని అన్నారు. ముఖ్యంగా ఈ వ్యవహారంపై తెలంగాణ ముఖ్యమంత్రి కుమారుడు, మున్సిపల్‌ మంత్రి కేటీఆర్‌ స్పందించకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. వెంటనే ఈ విషయంలో కేద్రం జోక్యం చేసుకొని కోర్టు లో సిబిఐ విచారణ జరపాలని వారు డిమాండ్ చేశారు.