Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

ఎవరైనా వ్యక్తి సులభంగా మోసపోతుంటే అతడిని అమాయకుడని అంటారు.ఒకే విషయంలో అతడు పదే పదే మోసపోతుంటే అతడిని ఏమనాలి ? ఆ పేరే ఉంటే దానిని బ్యాంకర్లకు అన్వయించాలి. ఎందుకంటే ఈ దశాబ్ద కాలంలో బడా పారిశ్రామిక వేత్తల చేతిలో పలు బ్యాంకులు మోసపోతూనే ఉన్నాయి. వేలకోట్ల రూపాయలను రుణాలుగా పొందిన పారిశ్రామిక వేత్తలు జల్సా చేసుకుంటున్నారు.ఆ రుణాలను వసూలు చేయడం బ్యాంకర్లకు గగనమైపోతోంది. అధికారంలో ఉన్న నేతలు, పలుకుబడి ఉన్న రాజాకీయ నాయకులు బ్యాంకర్లకు టోపీలు పెట్టె కార్యక్రమం పెట్టుకుంటున్నారు. అప్పుల బాధలతో రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. కానీ కోట్లాది రూపాయలు బ్యాంకులు బకాయిలు పడ్డా ఈ బడా బాబులు మాత్రం దర్జాగా తిరుగుతున్నారు. దానికి కారణం పలుకుబడి, అధికారమే.

దీనికి మన రాష్ట్రం నుంచి ఉదాహరణగా చెప్పుకోవలసి వస్తే కేంద్ర మంత్రి సుజనాచౌదరి పేరే ముందుగా చెప్పుకోవాలి. తెలుగు దేశం పార్టీ అధికారంలో లేనప్పుడు సుజనాచౌదరి అండ చంద్రబాబుకు బాగా ఉపయోగ పడింది.అప్పటికే సుజనాచౌదరి పేరుమోసిన పారిశ్రామిక వేత్త. దీనితో చంద్రబాబు అతడికి ఏరికోరి రాజ్యసభ ఎంపీ సీటుని ఆయనకు కేటాయించారు. టిడిపి 2014 లో అధికారం లోకి వచ్చిన తరువాత సుజనా చౌదరి వ్యాపార లావాదేవీలకు సంబందించిన విషయాలు బయటపడ్డాయి. సుజనా చౌదరి భాగస్వామ్యం ఉన్న కంపెనీలు బ్యాంకులకు కోట్లాది రూపాయల బకాయిలు పడ్డాయి. దీనిపై స్పందించిన సుజనా.. ఆ విషయం తనకు తనకు సంబంధం లేదని అది ఆయా కంపెనీల వ్యహహారమని సర్ది చెప్పుకునే ప్రయత్నం చేసారు.ఈ కేసు ప్రస్తుతం కోర్టులో నడుస్తోంది. సుజనా చౌదరి ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్నారు.సుజనా చౌదరి చేతిలో అధికారం ఉండడంతో బ్యాంకర్లు అతడిని ఏమి చేయలేకున్నారన్న ప్రచారం ఉంది.

ఇక కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యా వ్యహారం అయితే దేశంలోనే సంచలనం. అతడు వేల కోట్లలో బ్యాంకులకు బకాయిలు ఉన్నాడు. ఈడీ అతడి ఆస్తులను అటాచ్ చేస్తున్నా కేసులో సరైన పురోగతి కనిపించడం లేదు.దీనికి కూడా విజయ్ మాల్యా పలుకుబడే కారణం అని అంటున్నారు.ఇక వ్యాపారాలు ఉన్న అరకు ఎంపీ కొత్త పల్లి గీత నేతలు బ్యాంకులకు టోపీ పెట్టిన వారిజాబితాలో చాలా మందే ఉన్నారు. తాజాగా ఇలాంటి వ్యవహారమే ఏపీలో మరొకటి బయట పడింది. నెల్లూరుకు చెందిన ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి నాలుగు బ్యాంకులకు రూ 443 కోట్ల బకాయిలు పడ్డట్లు అధికారులు తేల్చారు. దీనితో వాకాటి కి చెందిన నెల్లూరు జిల్లాలోని స్థిరాస్తులను బ్యాంకర్లు స్వాధీనం చేసుకున్నారు. విఎన్నార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పవర్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి కంపెనీలకు వాకాటి హామీదారుగా ఉన్నారు. ఇలా బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టిన చోటా బడా నేతల లిస్ట్ దేశంలో చాలా పెద్దదే ఉంది. తమ పేరుతో పలు కంపెనీలు ఉన్నాయని వాటికి లోన్ కావాలని వారు బ్యాంకర్లను సంప్రదిస్తారు. రుణాలు చెల్లించామని బ్యాంకర్లు నోటీసులు పంపితే మాత్రం ఆయా కంపెనీ ల గురించి తమకేం తెలియదని చేతులు ఎత్తేస్తారు. ఈ దశాబ్ద కాలం లో పలువురు బడా పారిశ్రామిక వెతలు ఈవిధంగానే బ్యాంకులను మోసం చేస్తున్నారు.