Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

టాలీవుడ్ హీరోల స‌ర‌ళి మారింది. ఒక్కొక్క‌రుగా బుల్లితెర బాట ప‌డుతున్నారు. అక్క‌డ భారీగా ముట్ట‌జెబుతున్న పారితోషికాలు అందుకుంటూ రియాలిటీ షోల‌కు హోస్టులుగా వెలిగిపోతున్నారు. ఇప్ప‌టికే మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున వంటి స్టారాధిస్టార్లు `ఎంఈకే` షోతో బుల్లితెర హోస్ట్‌లుగా వెలిగిపోయారు. ఇక ఇదే రేసులోకి జూనియ‌ర్ ఎన్టీఆర్ దిగిపోవ‌డం హాట్ టాపిక్ అయ్యింది. స్టార్ – మా నిర్వ‌హించే `బిగ్‌బాస్` రియాలిటీ షో హోస్ట్‌గా ఎన్టీఆర్ కొన‌సాగుతుండ‌డం ఇప్పుడు ట్రెండ్ సెట్ చేస్తోంది. అయితే ఇంత‌మంది స్టార్లు హోస్టింగులో కొన‌సాగుతున్నారు క‌దా? బుల్లితెర హోస్టింగు-పారితోషికంలో నంబ‌ర్ 1 ఎవ‌రు? నంబ‌ర్ -2 స్థానంలో ఎవ‌రున్నారు? వ‌ంటి విష‌యాల‌పై ఆరాతీస్తే తెలిసిన సంగ‌తులివి. ఇప్పుడు లైవ్‌లో ఉన్న స్టార్ల‌లో నంబ‌ర్ -1గా స‌ల్మాన్ పేరు వినిపిస్తే, నంబ‌ర్ -2గా యంగ్ టైగ‌ర్‌ ఎన్టీఆర్ పేరు వినిపిస్తోంది.

బుల్లితెర రియాలిటీ యాంక‌ర్ల‌లో కండ‌ల హీరో స‌ల్మాన్‌ని కొట్టేవాళ్లెవ‌రూ ఇప్ప‌ట్లో లేరు. ఆ స్టార్ హీరో ద‌రిదాపుల్లో ఎవ‌రూ లేనేలేరు. పారితోషికంలో అత‌డిని ట‌చ్ చేయ‌డం అన్న‌ది అసాధ్యం. ఎందుకంటే స‌ల్మాన్ `బిగ్‌బాస్‌` లో ఒక్కో ఎపిసోడ్ చేసినందుకు ఏకంగా 6-8 కోట్లు అందుకుంటున్నాడు. ఇదే `బిగ్‌బాస్‌` రియాలిటీ షో ఇరుగు పొరుగు భాష‌ల్లోకి వ‌చ్చింది. ఇప్ప‌టికే క‌న్న‌డంలో నాలుగు సీజ‌న్లు పూర్త‌యింది. అక్క‌డ సుదీప్ హోస్టింగ్ చేస్తున్నారు. అలాగే త‌మిళంలో ప్ర‌వేశించింది. త‌మిళంలో విశ్వ‌న‌టుడు క‌మ‌ల్‌హాస‌న్ హోస్టింగ్ చేస్తున్నారు. ఆ ఇద్ద‌రికీ ఏ రేంజులో పారితోషికాలు అందుతున్నాయి? అన్న‌ది ఆరాతీస్తే క‌మ‌ల్‌హాస‌న్‌కి 15 కోట్లు అందుతోంది. ఇక‌ క‌న్న‌డ‌లో కిచ్చా సుదీప్ సీజ‌న్‌కి 5 కోట్లు అందుకుంటున్నాడు. అయితే ఈ ఇద్ద‌రికంటే చాలా ఎక్కువ‌గానే అందుకుంటున్నాడు జూ.ఎన్టీఆర్‌. తెలుగులో బిగ్‌బాస్ రియాలిటీ షో ఈ ఏడాది నుంచే అడుగుపెడుతోంది. తొలి సీజ‌న్‌కి యంగ్ య‌మ లాంటి క్రేజీ హీరో యాంక‌రింగ్ చేయ‌డం అభిమానుల్లో హీట్ పెంచ‌డం సాధ్య‌మ‌వుతుంది. తార‌క్‌కి ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా.. ప్రేక్ష‌కాభిమానం దృష్ట్యా.. స్టార్ -మా ఏకంగా 25 కోట్ల కు డీల్ కుదుర్చుకుంద‌ని తెలుస్తోంది.

ఇక బుల్లితెర హోస్టింగ్‌లో స‌ల్మాన్ ద‌రిదాపుల్లో వేరొక‌రి పారితోషికం ఊహించ‌లేం. అత‌డు ఇండియాలోనే నంబ‌ర్ వ‌న్‌. ఇక సౌత్ వ‌ర‌కూ వ‌స్తే.. ఎన్టీఆర్ నంబ‌ర్ -1 పొజిష‌న్‌లో పారితోషికం అందుకుంటున్నాడు.ఇక తెలుగు వ‌ర‌కూ వ‌స్తే బుల్లితెర రియాలిటీ షోల్లో ఇప్ప‌టివ‌ర‌కూ మెగాస్టార్ చిరంజీవి నంబ‌ర్ -1 పారితోషికం అందుకున్నారు. ఇప్పుడు ఆ రికార్డును యంగ్ టైగ‌ర్ బ్రేక్ చేశాడు. అలాగే ఉత్త‌రాదిన బిగ్ బాస్ 20 సీజ‌న్లు విజ‌య‌వంతంగా పూర్తి చేసుకుంది. క‌న్న‌డ‌లో నాలుగు సీజ‌న్లు పూర్త‌య్యాయి. ఈనెల 25 నుంచి త‌మిళంలో `బిగ్‌బాస్‌` లాంచ్ అవుతోంది. త‌దుప‌రి తెలుగులో ఎన్టీఆర్ హోస్టుగా ఘ‌నంగా ప్రారంభం కానుంది. ఇక వెండితెర కెరీర్ ప‌రంగా చూస్తే తార‌క్ ఇప్ప‌టికే వ‌రుస హ్యాట్రిక్‌ల‌తో జోరుమీదున్నాడు. టెంప‌ర్, నాన్న‌కు ప్రేమ‌తో, జ‌న‌తా గ్యారేజ్ చిత్రాల‌తో హ్యాట్రిక్ అందుకుని, మ‌రో మూడు సినిమాల‌కు లైన‌ప్ సెట్ చేశాడు. ఇప్ప‌టికే జై ల‌వ‌కుశ సెట్‌లో ఉంది. త‌దుప‌రి కొర‌టాల‌, త్రివిక్ర‌మ్‌ల‌తో సెట్స్‌కెళుతున్నాడు. ఈ క్రేజు దృష్ట్యా కూడా బ‌హుశా .. బుల్లితెర హోస్టింగ్ కోసం స్టార్ -మా ఏకంగా పాతిక కోట్లు ముట్ట‌జెబుతోంద‌ని అనుకోవ‌చ్చు.