Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

గత కొన్నేళ్లుగా భారతదేశ న్యాయస్థానం ముందు ఉన్న అతిపెద్ద చిక్కుముడి బాబ్రీ మజీద్. రెండు మతాల మధ్య ఉన్న వైరం విషయంలో అత్యున్నత న్యాయస్థానం ఏ నిర్ణయం తీసుకోలేకపోతోంది. గడిచిన 20 ఏళ్ల నుండి వాయిదాల పద్దతిలో కాలాన్ని వెల్లడిస్తున్న సంగతి తెలిసిందే. అయితే రీసెంట్ గా ఈ కేసులు కొందరు రాజకీయ నాయకులు ఉన్నట్లు ప్రచారం జరిగింది. ముఖ్యంగా ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న బీజేపీ సీనియర్ నేతలు ఎల్.కె. అద్వానీ, మురళీ మనోహర్ జోషీ, కేంద్ర మంత్రి ఉమా భారతిలను సీబీఐ గత కొన్ని రోజులుగా విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. అయితే సీబీఐ ప్రత్యేక కోర్టు వీరికి కొంత ఊరట నిచ్చింది. గత నెల 30న వీరికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే రీసెంట్ గా ఇక నుంచి వ్యక్తిగత హజరీ వీరందరికి మినహియింపు ఇస్తున్నట్లు ప్రకటించడంతో వారికి కొంత సంతోషాన్ని కలిగించింది. అయితే ఈ కేసులో తుది నిర్ణయం వెలువడటానికి ఇంకా ఎన్ని రోజులు పడుతుందో తెలియదని న్యాయవ్యవస్థ నిపుణులు తెలియజేశారు.