Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

ప్యారిస్ లో ఓ విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. పొరపాటు పడి ఓ వ్యక్తిని ఉగ్రావాది అని పోలీసులకు పట్టించారు ప్రజలు. తీవ్ర కలకలం సృష్టించిన ఈ ఘటన మార్సెల్లీ నుంచి ప్యారిస్ వెళ్లే మెట్రో రైల్లో చోటుచేసుకుంది. దీంతో అందరు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అసలు వివరాల్లోకి వెళితే మెట్రో రైల్లో మార్సెల్లీ అనే 35 ఏళ్ల వ్యక్తి ప్రయాణిస్తున్నాడు. కొద్దీ సేపటి తర్వాత అతను మెల్లగా ట్రైన్ లోని బాత్రూమ్ కి వెళ్లి తుపాకులు, ఆయుధాలు అంటూ కొన్ని పదాలను ఇంగ్లీష్‌లో, డచ్ భాషలో పదే పదే ఉచ్చరించాడు. దీంతో తోటి ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పెద్దగా అరుస్తుండడంతో సమీపాన ఉన్న పోలీస్ లైన్ కి సమాచారం అందించడంతో వారు వచ్చి అతన్ని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఈ వార్త విన్న ప్యారిస్ ప్రజలు బాయందోళన చెందారు.

మీడియా సైతం దీనిని పెద్దదిగా చేయడంతో 2015 లో జరిగిన ఉగ్రదాడి తరహాలోనే మళ్లీ మరో దాడి జరగనుందని అంతా బావించారు. కానీ ఆ యువకుడు అసలు విషయం చెప్పాక అందరు ఊపిరిపీల్చుకున్నారు. అతను ఏం చెప్పాడంటే ?.. నేను ఒక హాలీవుడ్ సినిమాలో నటిస్తున్నాను. అందులో భాగంగా ఆ మూవీ లోని కొన్ని డైలాగ్స్ ప్రాక్టీస్ చేస్తున్నాని, తానొక మూవీ ఆర్టిస్ట్ అని చెప్పడంతో పోలీసులు విచారించి అతడిని వదిలేశారు. అయితే అతన్ని అంతగా ఇన్వెస్టిగేషన్ చేయడానికి కారణం లేకపోలేదు. ప్రస్తుతం ఆ దేశంలో కొందరు ఉగ్రవాదులు ఉన్నారని నిఘా సంస్థలు వెల్లడించడంతో పోలీసులు ఏ మాత్రం అనుమానం వచ్చిన ఎవ్వరిని వదలడం లేదు. 2015 నవంబర్ లో ఐసిస్ జరిపిన ఉగ్రదాడిలో 130 మంది చనిపోయారు.