Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

ప్ర‌స్తుతం ప్ర‌తి గ్రామంలో అందుబాటులో ఉన్న ప్రాథ‌మికోన్న‌త పాఠ‌శాల‌లు (6,7 క్లాసులు) ఎత్తేసే ఆలోచ‌న‌లో ప్ర‌భుత్వాలు ఉన్నాయా? అంటే అవున‌నే స‌మాచారం. ఆ మేర‌కు త్వ‌ర‌లోనే ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు రానున్నాయ‌ని తెలిసింది. ప్ర‌భుత్వ స్కూళ్ల‌ను మూసేసి ప్ర‌యివేటుకు ప‌ట్టంగ‌ట్టేందుకు ప్ర‌భుత్వాలు సంసిద్ధ‌మ‌య్యాయ‌న్న‌ది తాజా ఎనాలిసిస్ సారాంశం. వివ‌రాల్లోకి డీప్‌గా వెళితే..

నాటి గ్రామపెద్దలు, ప్రభుత్వాలు ప్రాధమికోన్నత పాఠ శాలలను ఎందుకుఏర్పాటు చేశారు? 5 వతరగతి పూర్తి చేసి న పిల్లకు పాఠ శాలలు అందుబాటులో ఉండేవికావు. 10 కిలోమీటర్ల దూరం లో గల ఉన్నత పాఠశాలకు వెళ్లలేని పేదపిల్లల చదువు ముగిసి పోయేది .దీనిని గమనించిన ఆనాటి గ్రామపెద్దలు ప్రభుత్వం చుట్టూ తిరిగి 1970 వ సంవ‌త్స‌రం ప్రాంతం లోనే సాధించుకొన్న వే ఈ ప్రాథమికోన్నత పాఠశాలలు. కానీ ప్రస్తుతం 6 మరియు 7 తరగతులలో ౩౦ మందికన్నా తక్కు వ పిల్లలువుంటే ఆ పాఠశాలలు మూసి వేసేందుకు ప్రభుత్వం ప్రతి పాదనలు సిద్దం చేసింది. ఈ పాఠశాలకు 3 కి.మీ సమీపం లో 6 ,7 తరగతులు అందు బాటులో లేకపోయినా ట్రాన్స్పోర్టు సదుపాయం కల్పించి పాఠశాలలను మూసివేస్తామని ప్రభుత్వం ప్రతిపాదించింది . ఇదే జరిగితే మండలానికి ఒక ప్రాథమికోన్నత పాఠశాల కూడా మిగిలేపరిస్థితి లేదు .దీని ప్రజలు , ప్రజాసంఘాలు, తల్లిదండ్రులు , ఉపాద్యాయులు ,పాత్రికేయులు , అడ్డుకోవాల్సిన అవసరం ఉంది .6 ,7 తరగతులు అందుబాటు లో లేక చాలమంది పేదపిల్లలు, బాలికలు డ్రాప్ అవుట్లుగా మారుతారు .అనేక పథకాలకు వేలకోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వాలు పేదపిల్లలు చదివే ఈ పాఠశాలలను భారంగా భావించకూడదు . ఈరోజు పిల్లల కొరకు చేసే ఖర్చు మీదే దేశ భవిష్యత్తు ఆధారపడివున్నది .కనుక 6 ,7 తరగతుల లో 15 మంది పిల్లలున్నా ప్రాథమికోన్నత పాఠశాలలను కొనసాగించే విధంగా ప్రభుత్వం పై ఒత్తిడి తేవాలి . ప్రాథమికోన్నత పాఠశాలల ను కాపాడాలి .ప్రజలు కుడా పాఠశాలలను ఉపాధ్యాయు లకు జీతాలు ఇచ్చే కేంద్రాలుగా చూడకూడకూడదు . తమబిడ్డలను తీర్చిదిద్దే కేంద్రలుగా చూడాలి . రాబోయె రోజులలో మీపిల్లలు ఉపాద్యాయులు కావొచ్చు . ఈపాఠశాలలో పనిచేయ వచ్చు . కనుక మనపిల్లలకోసం భావి తరాల కోసం ప్రాథమికోన్నత పాఠశాలల కాపాడాలి . ప్రభుత్వ పాఠశాలలను కాపాడక పోతే ప్రయివేటు పాఠశాలల పెరిగిపోయి విద్యను కొనుక్కోవలసి వొస్తుంది .పాత రోజులు పునరావృత మవుతాయి .ధనవంతులకు ,ధనవంతుల సహాయం పొందినవారికే విద్య అందుతుంది . పేద వారు విద్యను కొనలేరు . చేయి చేయి కలిపి పెద్దఉద్యమం చేసైనాసరే ప్రాథమికోన్నత పాఠశాలల ను కాపాడుకోవాల్సిన అవ‌సరం ఉంద‌ని ఉపాధ్యాయ సంఘాలు ఉద్య‌మం చేప‌ట్టేందుకు రెడీ అవుతున్నాయ్‌.