Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

గత ఆదివారం ఉదయం ఇంటి మొదటి అంతస్తు నుంచి కిందపడిన చిన్నారి ఫాతిమా వార్త అందరిని షాక్ కి గురి చేసిన తెలిసిందే. అయితే ఈ 18 నెలల చిన్నారి ఇప్పుడు మృత్యుంజయురాలైంది. తీవ్ర కలకలం సర్సుష్టించినా ఈ ఘటన బహదూర్‌పురాలో చోటు చేసుకుంది. ఇమ్రాన్‌, సుల్తానా దంపతుల కుమార్తె ఇన్యా ఫాతిమా ఆడుకుంటూ.. ప్రమాదవశాత్తు బిల్డింగ్ పై నుంచి కింద పడిపోయింది. పడిపోయిన వెంటనే ఆ పాప స్పృహ కోల్పోయింది. దీంతో వారి ఇంటి ఎదురుగా ఉన్న మురుగన్ అనే వ్యక్తి చిన్నారిని తీసుకొని పాప తల్లికి చెప్పడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే మొదట సుల్తానా పరిస్థితి విషమంగా ఉందని చెప్పిన డాక్టర్లు ఆ తరువాత పాపను రక్షించి ఆ కుటుంబానికి దేవుడయ్యారు. దీంతో ప్రస్తుతం పాప కోలుకుంటుందని తల్లిదండ్రులు ఆనందంతో తెలిపారు.