Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

నేతాజీ సుభాష్ చంద్రబోస్…. ఈ పేరు వినగానే అప్పటి బ్రిటిష్ పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెట్టేవి. తనకంటూ ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని భారతదేశాన్ని పట్టి పీడిస్తున్న బ్రిటిష్ వాళ్ళను తరిమితరిమి కొట్టారు బోస్. ఆయనను పట్టుకునేందుకు బ్రిటిష్ ప్రభుత్వం చాలా రకాల ప్రయత్నాలు చేసింది. కానీ వాళ్ళు చేసిన ప్రయత్నాలన్నీ విఫలం అయ్యాయి. తరువాత ఎప్పుడో ఆయన విమాన ప్రమాదంలో మరణించారని వార్తలు వచ్చాయి. దీనిని కొంతమంది నమ్మారు. కానీ మరికొంతమంది మాత్రం నేతాజీ ఇంకా బ్రతికే ఉన్నారంటారు. ఇండియాకి స్వాతంత్య్రం వచ్చి దాదాపు 70 సంవత్సరాలు కావొస్తున్నా ఇప్పటివరకు ఆయన ఎలా మరణించింది తెలియరావట్లేదు. తాజాగా నేతాజీ మరణంపై వచ్చిన ఒక వార్త సంచలనం సృష్టిస్తుంది.

సుభాష్ చంద్రబోస్ విమాన ప్రమాదంలో చనిపోలేదని, సోవియట్ యూనియన్ లో బ్రిటిష్ అధికారుల ఇంటరాగేషన్ లో చిత్రహింసల వల్ల చనిపోయారని ఒక వార్త బయటకొచ్చింది. రిటైర్డ్ మేజర్ జనరల్ జీడీ బక్షి రాసిన ‘బోస్ – ది ఇండియన్ సమురాయ్’ అనే పుస్తకంలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. జపాన్ నుండి తప్పించుకుని నైజీరియా వెళ్లిన నేతాజీ అక్కడ ఆజాద్ హింద్ ప్రభుత్వ ఎంబసీని ఏర్పాటు చేశారని, నేతాజీ తప్పించుకున్నారన్న విషయం తెలుసుకున్న బ్రిటిష్ అధికారులు, ఆయనను విచారణకు అనుమతించాలని సోవియట్ యూనియన్ అధికారులపై ఒత్తిడి తెచ్చారని ఆయన ఆ పుస్తకంలో వివరించారు.