Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

తమిళనాడులో ప్రైవేట్ పాల ప్యాకెట్లులో ప్రమాదకర రాసాయినాలు కలుపుతున్నట్లు తమిళనాడు మంత్రి రాజేంద్ర బాలాజీ ఘాటుగా విమర్శలు చేసి ఒక్కసారి మీడియా లోకి వచ్చిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ దెబ్బ ఎక్కువగా తమిళనాడులో పాల వ్యాపారం చేస్తున్న హెరిటేజ్ మీద పడిందనేది వాస్తవం. దీంతో ఇప్పటికే 40 శాతం హెరిటేజ్ విక్రయాలు తమిళనాడులో పడిపోయినట్లు తెలిస్తుంది. ఈ నేపధ్యంలో ముఖ్యమంత్రి పళనిస్వామి, మంత్రి రానేజ్ద్ర బాలాజీని గట్టిగా హెచ్చరించినట్లు తెలుస్తుంది. పాల విషయంలో ఎక్కువగా రాద్దాంతం చేయొద్దని ఈ విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు జోక్యం చేసుకుంటే పరిస్థితి వేరుగా ఉంటుందని హెచ్చరించినట్లు సమాచారం. చంద్రబాబుకి జాతీయ స్థాయిలో పలుకుబడి వుందని. ఆయన గాని తలుచుకుంటే తమిళనాడులో మన ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం వుందని. పార్టీ నుంచి 10-20 ఎమ్మెల్యేలు బయటకు వెళ్ళిపోయే అవకాశం వుందని. అందుకే ఈ విషయంలో ఎలాంటి అల్లరి చేయకుండా సైలెంట్ గా వుండాలని తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, రాజేంద్రకి గట్టిగా హెచ్చరించినట్లు సమాచారం. ఈ హెచ్చరికల వలెనే ఇన్ని రోజులు హడావిడి చేసిన మంత్రి కూడా సైలెంట్ అయిపోయాడని తెలుస్తుంది. మొత్తానికి చంద్రబాబుకి తమిళనాడు ప్రభుత్వం కూడా భయపడుతుందంటే, కాస్తో, కూస్తో పలుకుబడి ఉన్నట్టే.