Poltical News

News

క్రీడలు

యువత

Hyderabad Metro Rail

చర్చలు

వాళ్ళిద్దరూ అన్నదమ్ములు, సామాన్య స్థాయి నుంచి అసామాన్య స్థాయికి ఎదిగిన అపర కుబేరుడు దీరూబాయ్ అంబానీ కొడుకులు, అన్నిటికి మించి పెట్రోలియం, రిలయన్స్ ఇండస్ట్రీకి వారసులు కాని ఆస్తుల దగ్గరకు వచ్చేసరికి ఇద్దరికి పెద్ద గొడవలు. ఆధిపత్యం కోసం ఒకరిపై ఒకరు పోరు. గెలవడం కోసం ఎంతవరకైన వెళ్ళే పొగరు. అనిల్ అంబానీ, ముఖేస్ అంబానీ మధ్య వున్న ఆ వైరం ఇప్పుడు ఒకరిని ఒకరు క్రిందికి దించుకోవడానికి ప్రయత్నించే వరకు వచ్చింది. అన్నదమ్ముల జరుగుతున్నా ఈ పోరులో అన్న ముఖేష్ ఆధిపత్యం చూపించేలానే కనిపిస్తున్నాడు. ముకేష్ అంబానీ మార్కెట్ లోకి తీసుకొచ్చిన జియో దెబ్బకు రిలయన్స్ టెలికాం సర్వీస్ భారీ నష్టాల్లోకి వెళ్ళిపోయి, వేల కొట్లలో బ్యాంకు రుణాలు పెండింగ్ లో ఉండిపోయాయి. ఇప్పుడు ఆ బ్యాంకు రుణాలు తీర్చమని సంస్థ మీద ఒత్తిడి వస్తుంది. దాంతో పాటు రీసెంట్ రిలయన్స్ షేర్ కూడా పతనం అయిపోయింది. ఇలా దేశీ మార్కెట్ లో వరుసగా తగులుతున్న దెబ్బలతో అనిల్ అంబానీ కోలుకునే అవకాశం లేకుండా అయిపొయింది. అయితే అనిల్ పతనం వెనుక ముఖేష్ అంబాని ఉన్నాడని ప్రస్తుతం వ్యాపార వర్గాల్లో వినిపిస్తున్న మాట. తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకునే పనిలో వున్న ముకేష్, తనకు తమ్ముడు నుంచి ఎలాంటి పోటీ ఉండకూడదని అనుకుంటున్నట్లు సమాచారం. అందులో భాగంగామే తన వ్యాపారాలని అంచెలంచెలుగా దేబ్బకోడుతూ, తమ్ముడు పతనాన్ని కోరుకున్తున్నాడని తెలుస్తుంది. ప్రస్తుతం అన్నదమ్ముల మధ్య అంతర్ఘతంగా వున్న ఈ వ్యాపార యుద్ధం ఎంత వరకు దారి తీస్తుందో చూడాలి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఇండియాలో కొన్ని వ్యాపార సంస్థల అధినేతలు బ్యాంకు రుణాలు చెల్లించలేక, భారీ అప్పులని భరించలేక పెద్ద మోసాలకు పాల్పడి దేశాలు విడిచి పారిపోయిన ఘటనలు మనం చూస్తున్నాం. రేపటి రోజున అనిల్ అంబానీకి కూడా అదే పరిస్థితి వస్తుందేమో అని అందరు అనుకుంటున్నారు.